ఐపీఓకు స్టాండర్డ్​ గ్లాస్ లైనింగ్ రూ. 600 కోట్ల సమీకరణ 

ఐపీఓకు స్టాండర్డ్​ గ్లాస్ లైనింగ్ రూ. 600 కోట్ల సమీకరణ 

హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ కోసం తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌‌‌‌హెచ్‌‌‌‌పీ)ని సెబీకి అందజేసినట్టు తెలిపింది. పబ్లిక్​ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు తెలిపింది.  ఇందులో మొత్తం రూ. 250 కోట్ల వరకు ఫ్రెష్‌ ఇష్యూ ఉంటుంది. ఆఫర్ ​ఫర్​ సేల్​ ద్వారా రూ.350 కోట్ల విలువైన 18.444 మిలియన్ల షేర్లు అమ్మకానికి వస్తాయి.

ప్రమోటర్లు  కందుల రామకృష్ణ, కందుల కృష్ణ వేణి, నాగేశ్వర్ రావు కందుల, కాట్రగడ్డ మోహన్ రావు, కాట్రగడ్డ శివప్రసాద్, కుదరవల్లి పున్నారావు ఈ ఆఫర్ ద్వారా తమ హోల్డింగ్స్‌‌‌‌లో కొంత భాగాన్ని విక్రయిస్తారు. ఫార్మా,  కెమికల్ రంగాల కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్‌‌‌‌కు చెందిన కంపెనీ 100 శాతం బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిధులను సేకరిస్తుంది. ఇది ఈ ఆఫర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన వ్యయం, ఇప్పటికే ఉన్న కొన్ని అప్పులను తిరిగి చెల్లించడం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది.