బీఆర్ఎస్ కార్పొరేటర్ నామినేషన్ విత్ డ్రా.. ఇంకొకరు విత్ డ్రా చేసుకుంటే స్టాండింగ్​ కమిటీ ఏకగ్రీవం

బీఆర్ఎస్ కార్పొరేటర్ నామినేషన్ విత్ డ్రా.. ఇంకొకరు విత్ డ్రా చేసుకుంటే స్టాండింగ్​ కమిటీ  ఏకగ్రీవం

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్​కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి తప్పుకున్నారు. గురువారం ఆమె తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్​పార్టీ నుంచి నామినేషన్​వేసిన సత్యనారాయణ కూడా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.  నామినేషన్ల ఉపసంహణకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది.

ఆ తర్వాత పోటీలో ఉండే వారి ఫైనల్ లిస్ట్​ను ప్రకటిస్తారు. కాగా, బీఆర్ఎస్​ నుంచి నామినేషన్ వేసిన సత్యనారాయణ కుంభమేళాలో ఉన్నారు. ఆయన శుక్రవారం ఉదయం సిటీకి రాబోతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినా ప్రపోజల్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.