
హైదరాబాద్, వెలుగు: కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాల పరిశీలనకు స్టాండింగ్ కమిటీ శనివారం నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్రం లో పర్యటించనున్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పనితీరు తెలుసుకునేందుకు హైదరాబాద్‌తోపాటు పహల్గాం, పూరీ, శ్రీనగర్‌లో పర్యటించనున్నది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌కు సంబంధించిన వివిధ పథకాల అమలులో బ్యాంకుల పాత్రను పరిశీలించనున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ కు చేరుకుంది. శనివారం ఉదయం 10.00 గంటలకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూర ల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్డీ, పీఆర్)ను సందర్శించనున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై అధి కారులతో చర్చించనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు, పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియా అధికారులతో సమావే శం కానున్నది. ఆదివారం స్టాడింగ్ కమిటీ సభ్యులు తిరిగి వెళ్లనున్నారు.