
కంది, వెలుగు : సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎం హెచ్ ఓ ఆఫీస్ ముందు సీఐటీయూ నాయకులు, ఏఎన్ఎంలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన షరతులు భేషరతుగా ఉపసంహరించుకొని యథావిధిగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంగీత, మాధవి, సంపూర్ణ, శ్యామల, కళ్యాణి, జయ, రాధా, సరళ, మానెమ్మ, జానకి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ మద్దతు
సిద్దిపేట టౌన్ : సెకండ్ ఏఎన్‌ఎంలను వెంటనే రెగ్యులరైజ్ చెయ్యాలని, లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు ఆఫీస్‌ను ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ సూర్యవర్మ అన్నారు. గురువారం పట్టణంలో సెకండ్ ఏఎన్ఎంలు చేస్తున్న నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఆయన వెంట పీసీసీ మైనారిటీ వైస్ చైర్మన్ కలీముద్దీన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మున్నా, మిద్దె ప్రసాద్, అర్షద్ , జావేద్ ఉన్నారు.