సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క(Anushka) నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty). జాతిరత్నాలు(Jathirathnalu) ఫేమ్ నవీన్ పోలిశెట్టి(Naveen polishetty) హీరోగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాలం తరువాత అనుష్క కు సూపర్ హిట్ పడింది. దీంతో ప్రస్తుతం ఆమె ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ALSO READ: సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఇక తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. దానికి ఆడియన్స్ కు నా కృతజ్ఞతలు. ఇందులో భాగంగా అనుష్క ఈ మధ్య ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరగడం గురించి ప్రస్తావన వచ్చింది. దానికి సమాధానంగా అనుష్క.. నాకు చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లడం అంటే చాల ఇష్టం. కొంత కాలం నటిగా బిజీగా ఉండటంతో అప్పుడు సమయం కుదరలేదు. ఈ మధ్య కాస్త సమయం దొరికింది కాబట్టి వెళుతున్నాను. ఇంట్లో కూడా ఇప్పటికీ సోమవారం, శుక్రవారం పూజలు చేస్తాను. ఇక ఈ పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? అన్న ప్రశ్నించగా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చాఋ అనుష్క. ప్రస్తుతం అనుష్క చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.