Keerthy Suresh, Suhas: సుహాస్ రేంజ్ పెరిగిపోయిందిగా.. ఏకంగా మహానటితో!

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిన ఈ నటుడు.. మెల్లిగా సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించడం మొదలుపెట్టాడు. కలర్ ఫోటో సినిమాతో సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సుహాస్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోగా వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో సూపర్ అందుకున్న సుహాస్.. ప్రస్తుతం శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలు చేస్తున్నాడు. నెల వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

ఇదిలా ఉంటే.. తాజాగా మరో బంపర్ ఆఫర్ కోటేశాడట సుహాస్. అవును స్టార్ హీరోయిన్, మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో ఉప్పు కప్పురంబు అనే సినిమా రానుంది. దర్శకుడు  ఐవీ శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాధికా లావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని ఒక స్మశానాన్ని విస్తరించడం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది అని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్. సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారని టాక్.

ALSO READ :- Double iSmart: శివరాత్రికి రిలీజ్ అన్నారుగా..డబుల్ ఇస్మార్ట్కి ఏమైంది పూరి?

ఇక ఈ సినిమాలోనే మరో కీ రోల్ కోసం నటుడు సుహాస్ ను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో సుహాస్ కీర్తి సురేష్ కి పెయిర్ గా చేస్తున్నాడా.. లేక మరేదైనా ప్రత్యేకమైన రోలా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ న్యూస్ గురించి తెలుసుకున్న నెటిజన్స్ సుహాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ అయ్యి.. ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తున్నావంటే మామూలు విషయం కాదన్నా సుహాసన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.