ఖుషీ(Kushi) సినిమా తరువాత మరో కొత్త సినిమాను ప్రకటించలేదు సౌత్ బ్యూటీ సమంత(Samantha). నిజానికి ఆమె సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోనీ ఖుషీ సినిమా అయినా అంతగా ఆడింది అంటే అదీ లేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అప్పటినుండి హనీ బన్నీ అనే హిందీ సిరీస్ లో నటిస్తున్న సామ్.. తాజాగా ఏప్రిల్ 28 తన పుట్టిన రోజు సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించింది.
ఇటీవల సమంత త్రాలల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ చేసిన విషయం తెలిసిందే. తన ఓన్ బ్యానర్ లోనే తన నెక్స్ట్ సినిమాను ప్రకటించింది. ఈ సినిమాను మా ఇంటి బంగారం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ రివీల్ చేస్తూ కాన్సెప్ట్ పోస్టర్ కూడా వదిలారు మేకర్స్. ఈ పోస్టర్ లో సమంత లుక్ చాలా కొత్తగా ఉంది. మేడలో తాలిబొట్టు, చేతిలో గన్, మొహానికి రక్తంతో, వంటగదిలో ఉన్న సామ్ లుక్ సరికొత్తగా ఉంది. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను సంబందించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మరి చాలా గ్యాప్ తరువాత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న సమంత ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.