మరింత బలంగా తిరిగొస్తా

మరింత బలంగా తిరిగొస్తా

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటమి తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యంత బాధాకరమైందని స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటోంది. మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకం గెలవాలనే తన కలను నెరవేర్చుకునేందుకు మరింత బలంగా తిరిగి వస్తానని స్పష్టం చేసింది. ‘నా ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల నేను ఆశించినట్లుగా సాగలేదు. ఎన్నో గంటల శిక్షణ, త్యాగం, పట్టుదల తర్వాత ఆ క్షణాలు నా నుంచి జారిపోయాయి. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఓటముల్లో ఇదే అత్యంత బాధకరమైంది.

దీన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నా హృదయం భారంతో బరువెక్కింది. ఈ ఓటమిని అంగీకరిస్తూనే ముందుకు సాగడానికి నా వంతు కృషి చేస్తా’ అని నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్వీట్ చేసింది.  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే క్రమంలో తనకు ఎదురైన ప్రతి సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరాడానని వెల్లడించింది. ‘ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గడం నా కల. పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేను పతకం గెలవలేకపోయా. ఇక్కడి నుంచి మరింత కృషి చేయాలని భావిస్తున్నా.  రాబోయే మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం నా ప్రయత్నాలు మొదలుపెడతా’ అని నిఖత్ పేర్కొంది.