Victory Venkatesh: తెలుగులో వెస్టర్న్‌ స్టైల్‌.. వెంకీ మామను ఆకాశానికెత్తేసిన సిద్దు

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square). బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సీక్వెల్ తో మరోసారి ఆడియన్స్ పక్కా వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు యూనిట్. దర్శకుడు మల్లిక్‌రామ్ (Mallik Ram) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా మార్చి 29న థియేటర్లలోకి రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ పనులు మొదలుపెట్టేశారు సిద్దు అండ్ టీమ్.ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సిద్దు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆయనపై తనకున్న ప్రేమను బాయటపెట్టేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు యాంకర్.

ALSO READ | Nani, Gareth Wynn Owen: హీరో నానితో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్.. ఏ సినిమా చూడాలో చెప్పండి!

దానికి బదులుగా సిద్దు మాట్లాడుతూ.. నేను వెంకటేశ్‌ (venkatesh)గారికి చాలా పెద్ద ఫ్యాన్. నాపై చిన్నప్పటి నుండే ఆయన ప్రభావం ఉంది. తెలుగులో వెస్టర్న్‌ స్టైల్‌ క్లాతింగ్‌ను పరిచయం చేసిన హీరో ఆయనే. నేను మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు సార్‌ మీ ఫొటోలన్నింటిని కట్‌ చేసి పుస్తకంలో దాచుకునేవాడిని అని చెప్పను. ఆయన స్టైల్‌ ను మ్యాచ్‌ చేయడం కష్టం... అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు. ప్రస్తుతం సిద్దు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.