ఎన్నికలయ్యే వరకు ఎక్కడికీ వెళ్లొద్దు

ఎన్నికలయ్యే వరకు ఎక్కడికీ వెళ్లొద్దు
  • జార్ఖండ్ లో కాంగ్రెస్ ఇన్​చార్జీలకు స్టార్ క్యాంపెయినర్  భట్టి ఆదేశం

హైదరాబాద్, వెలుగు : జార్ఖండ్  అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్  ఇన్ చార్జీలు నియోజకవర్గాన్ని వదిలివెళ్లరాదని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ, స్టార్ క్యాంపెయినర్  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  అక్కడి నేతలకు స్పష్టం చేశారు. శుక్రవారం రాంచీలో ఏర్పాటు చేసిన సీనియర్  నేతలు, జార్ఖండ్  పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీల సమావేశంలో భట్టి మాట్లాడారు. జార్ఖండ్  రాష్ట్ర ఎన్నికల్లో  సీనియర్ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. రామ్ గఢ్, బొకోరో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు సైతం తీసుకున్నానని  చెప్పారు.

ఎన్నికల్లో కాంగ్రెస్  కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విస్తృతంగా, సరైన పద్ధతుల్లో ప్రచారం నిర్వహించాలని, సోషల్ మీడియాను మరింత ఎక్కువగా వాడుకోవాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను జార్ఖండ్ లోనే ఉంటానని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని భట్టి భరోసా ఇచ్చారు.