Bharathiraja: షాకింగ్ న్యూస్: స్టార్ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కొడుకు మృతి

Bharathiraja: షాకింగ్ న్యూస్: స్టార్ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం..  అనారోగ్యంతో కొడుకు మృతి

తమిళ్ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. మంగళవారం ఆయన కుమారుడు మనోజ్ భారతీ రాజా (48) అస్వస్తత కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు.. 

పూర్తి వివరాల్లోకి వెళితే మంగళవారం (మార్చి 25) ఉదయం సమయంలో మనోజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ విషయం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు మనోజ్ ని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో మనోజ్ వెంటిలేటర్ పై కన్ను మూసినట్లు సమాచారం.. మనోజ్ మరణ వార్తని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేశారు.. దీంతో అభిమానులు, సినీ సెలెబ్రెటీలు భారతీరాజా ఫ్యామిలీ మెంబర్స్ కి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

అయితే మనోజ్ భారతీరాజా 1976లో జన్మించారు. ఆ తర్వాత తాజ్ మహల్ అనే సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రస్తుత్తం మనోజ్ భారతీ రాజాకి ఇద్దరు సంతానం. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న నటుడు మనోజ్ భారతీ రాజా ఇలా అర్త్యుషూ అర్థాయుస్సుతో మరణించడంతో భారతీరాజా కుటుంబం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది.

ALSO READ | Pawan Kalyan: గురువు మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో పవన్ కళ్యాణ్