ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ హానికరమైన సైబర్ దాడికి గురైంది. ఫలితంగా 3.1 మిలియన్ల కస్టమర్ల పర్సనల్ డేటా చట్టవిరుద్ధంగా ఆన్ లైన్ లో యాక్సెస్ అవుతుందని భారత ఆరోగ్య భీమా ప్రొవైడర్ బుధవారం అక్టోబర్ 9న నిర్ధారించింది.
ప్రముఖ ఆరోగ్య భీమా సంస్థల్లో ఒకటైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ భారీ డేటా ఉల్లంఘటనను ఎదుర్కొంటుంది. ఇది 31 మిలియన్ల కస్టమర్లను ప్రభావితం చేసిన డేటా ఆన్ లైన్ లో అమ్మకాలను స్టార్ హెల్త్ సంస్థ గుర్తించింది.దొంగిలించబడిన కస్టమర్ల వ్యక్తిగత డేటా ఆన్ లైన్ విక్రయం వాస్తవమేనని తెలిపింది. 31 మిలియన్లకు పైగా కస్టమర్లకు సంబంధించిన 7.24TB డేటాను యాక్సిస్ దొంగింలించిన హ్యాకర్ XenZen ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపింది.
బీమా, సైబర్ సెక్యూరిటీ రెగ్యులేటరీ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులతో దర్యాప్తు జరుగుతోంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డేటా దొంగిలించిన వ్యవహారంలో స్టార్ హెల్త్ అధికారి ప్రమేయం ఉన్నట్లు హ్యాకర్లు ఆరోపిస్తున్నారు.
ALSO READ : Microsoft Edge వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే
చెన్నై కేంద్రంగా స్టార్ హెల్త్ దేశంలోని మొత్తం 850 బ్రాంచిలతో దాదాపు 14వేల ఆస్పత్రులకు సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా 17కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య భీమాను అందిస్తోంది. వ్యక్తిగత ప్రమాదాలతోపాటు విదేశీ, ప్రయాణ బీమాను కూడా అందిస్తోంది.
టెలిగ్రామ్ చాట్ బాట్ ద్వారా డేటా లీక్ ..
3.1కోట్లకు పైగా స్టార్ హెల్త్ పాలసీదారులకు చెందిన వ్యక్తిగత డేటాతోపాటు 5.8 మిలియన్ల పైగా క్లెయిమ్ లకు సంబంధించిన సమాచారం టెలిగ్రామ్ చాట్బాట్ ల ద్వారా గత నెలలో పబ్లిక్ గా అందుబాటులోకి వచ్చింది.
టెలిగ్రామ్ పై స్టార్ హెల్త్ కోర్టులో ఫిర్యాదు
డేటా స్టీలింగ్ పై స్టార్ హెల్త్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దొంగిలించిన డేటాను అమ్మకానికి ఉపయోగించిన చాట్ బాట్ లను హోస్ట్ చేసినందుకు టెలిగ్రామ్ పై ఫిర్యాదు చేసింది. మరోవైపు డేటా బ్రీచ్ లో దాని CISO అమర్జీత్ ఖనుమా ప్రమేయంపై స్టార్ హెల్త్ స్పందించింది. అతను తప్పు చేసినట్లు గుర్తించలేదని తెలిపింది. డేటీ బ్రీచ్ ఆరోపణ క్రమంలో గురువారం ఉదయం స్టార్ హెల్త్ షేర్లు ఒక్కసారిగా కూలాయి. స్టార్ హెల్త్ షేర్లు 2.5 శాతం పడిపోయి ప్రస్తుతం రూ. 566 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.