తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.
టాలీవుడ్ టాప్ బ్యానర్..స్టార్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలుగా వ్యవహరించనున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)టైటిల్తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరుగుతోంది. అజిత్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్ లొకేషన్ నుంచి అజిత్ స్టన్నింగ్ లుక్‌ని రిలీజ్ చేశారు. వైట్అండ్ వైట్ సూట్‌లో ఛార్మింగ్ స్మైల్‌లో డైనమిక్‌గా కనిపిస్తున్నాడు అజిత్.
A stunning looking #AjithKumar from the shoot of #GoodBadUgly in Madrid ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 10, 2024
VERA LEVEL entertainment on the big screens for Pongal 2025 🔥
@MythriOfficial @Adhikravi @suneeltollywood @AbinandhanR @ThisIsDSP @editorvijay @GoodBadUglyoffl @SureshChandraa… pic.twitter.com/5ZuKSKW87b
టైటిల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పినట్టుగానే అజిత్ని మూడు విభిన్న షేడ్స్‌తో చూపిస్తున్నారు. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) స్టైల్లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025లో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
On the sets of #GoodBadUgly 💥🐉💥 pic.twitter.com/PM8Zjf3fYt
— Adhik Ravichandran (@Adhikravi) October 10, 2024