రఘువరన్ బీటెక్, సార్, అసురన్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు ధనుష్(Dhanush). టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోను సినిమాలు చేస్తూ..బిజిగా ఉన్నారు.
లేటెస్ట్గా తన దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ధనుష్ సింప్లిసిటీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్. అసిస్టెంట్ ఆనంద్ మ్యారేజ్కి అటెండ్ అయ్యి..నూతన దంపతుల్ని ఆశీర్వదించాడు. అంతేకాకుండా ఈ మ్యారేజ్కి రాధికా శరత్ కుమార్ కూడా అటెండ్ అయ్యారు. ప్రసెంట్ ఈ మ్యారేజ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది సినిమాల్లోనే హీరోస్ అని చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ధనుష్ బయట కూడా రియల్ హీరో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో చాలా మంది స్టార్ హీరోస్ తమ ఫ్యాన్స్ మ్యారేజ్కు అటెండ్ అయ్యారు. వారిలో తలపతి విజయ్..తల అజిత్ కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు టైం సెట్ అయితే తప్పకుండా అటెండ్ అవుతుంటారు. సూపర్స్టార్ రజినీ కూడా గతంలో అటెండ్ అయ్యేవారు. కోలీవుడ్లో పెద్ద స్టార్ డమ్ ఉన్నప్పటికీ..ఫ్యాన్స్ ను కలిసే హీరోస్ ఉంటారు. కానీ, ఇక్కడ టాలీవుడ్ లో అలా జరగదు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రీసెంట్గా నేషనల్ క్రష్ రష్మిక తన అభిమాని మ్యారేజ్ కి అటెండ్ అయ్యి నూతన దంపతుల్ని ఆశీర్వదించింది. ఆ విషయాన్ని రష్మిక సోషల్ మీడియాలో స్వయంగా తానే షేర్ చేసింది.
ALSO READ: ప్రశాంత్ వర్మ హనుమాన్ ప్రమోషన్స్ షురూ.. ఆసక్తిగా స్పెషల్ పోస్టర్
ప్రసెంట్ ధనుష్..డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీతో పాటు కెప్టెన్ మిల్లర్(Captain Miller) అనే సినిమా చేస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్(Arun Matheshwaran) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. గత కొంత కాలంగా ఈ సినిమా కోసం గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపించిన ధనుష్.. లేటెస్ట్ మరో సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశారు.
தனது உதவியாளர் ஆனந்த் திருமண வரவேற்ப்பு நிகழ்ச்சியில் திடீரென வந்து வாழ்த்திய தலைவர் @dhanushkraja sir ❣️?? #CaptainMiller #Dhanush pic.twitter.com/Lep0bzGyNR
— Dhanush Trends ™ (@Dhanush_Trends) September 16, 2023