Captain Miller: ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డు గెలుచుకున్న ధనుష్ మూవీ

Captain Miller: ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డు గెలుచుకున్న ధనుష్ మూవీ

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)హీరోగా థియేటర్లలోకి వచ్చిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌’(Captain Miller). తన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు.టీజర్‌‌‌‌‌‌‌‌,ట్రైలర్తో ఆడియాన్స్ను ఇంప్రెస్ చేసిన మేకర్స్..సినిమాతో బాగా డిస్సప్పాయింట్ చేశారు.కానీ,ఇందులో ధనుష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. దాదాపు రూ.100 కోట్లకి పైగా వసూలు చేసి ధనుష్ కెరీర్‌లో హిట్‌ లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ వెర్షన్ థియేటర్‌లోకి రాగా..తెలుగులో జనవరి 25న వచ్చింది. 

తాజా విషయానికి వస్తే కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌ అరుదైన అవార్డును సొంతం చేసుకుంది.ప్రస్తుతం లండన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇక ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్‌’ మూవీ కూడా నామినేషన్‌ దక్కించుకుంది. ఇకపోతే పలు హిట్ హాలీవుడ్‌ మూవీస్ తో ఈ సినిమాలు పోటీ పడి విదేశీ భాషా చిత్రంగా కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌ రావడం మేకర్స్ కి సంతోషాన్నిచ్చింది. 1930 - 40 లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్,సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.ప్రియాంక అరుళ్ మోహన్‌‌‌‌ హీరోయిన్గా నటించింది.

 

ప్రస్తుతం ధనుష్‌ సినిమాల విషయానికి వస్తే..ధనుష్‌ 50వ చిత్రంగా నటిస్తు దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘రాయన్‌’. ఈ మూవీ జులై 26న ఆడియన్స్ ముందుకురానుంది. ఇందులో హీరో సందీప్‌ కిషన్‌, ఎస్‌.జె.సూర్య, కాళిదాస్‌ జయరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తన 51 వ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.