RAAYAN Trailer: రాయన్ ట్రైలర్ గూస్బంప్స్..ధనుష్ ఫ్యాన్స్ ఇక మీ అంచనాలే!..ఊహించేసుకోండి

RAAYAN Trailer: రాయన్ ట్రైలర్ గూస్బంప్స్..ధనుష్ ఫ్యాన్స్ ఇక మీ అంచనాలే!..ఊహించేసుకోండి

తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ రాయన్. ఇది ధనుష్ కెరియర్లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్,ఫస్ట్ లుక్‍ పోస్టర్ రిలీజ్ చేయగా..ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ రాయన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రాయాన్ లుక్లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి భీకరంగా కనిపిస్తు చేతిలో కత్తులు ఉండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ట్రైలర్ లో రెహమాన్ తనదైన రస్టిక్ స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక టోటల్ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో..ధనుష్ ఫ్యాన్స్ ఓ సారి ఊహించేసుకోండి. ఇక మీ అంచనాలే!

ALSO READ | Kalki 2898 AD OTT Release Date: కల్కి 2898 AD OTT రిలీజ్ డేట్పై క్లారిటీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తమిళం,తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్ డైరెక్టర్, పీటర్ హైన్ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా వ్యవహరించాడు.ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర మూవీలో నటిస్తున్నాడు.