Dulquer Salmaan: డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైన దుల్క‌ర్ స‌ల్మాన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ..రిలీజైన ప‌దేళ్ల త‌ర్వాత తెలుగులో

Dulquer Salmaan: డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైన దుల్క‌ర్ స‌ల్మాన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ..రిలీజైన ప‌దేళ్ల త‌ర్వాత తెలుగులో

మహానటి,సీతారామం వంటి క్లాసికల్ హిట్స్ తో తెలుగులో మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan).రీసెంట్గా కల్కి మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించి ప్రశంసలు అందుకున్నాడు.ప్ర‌భాస్ యుద్ధ విద్య‌లు నేర్పిన ఓ గురువు పాత్ర‌లో త‌ళుక్కున మెరిసి ఆకట్టుకున్నాడు. 

తాజాగా దుల్కర్ సల్మాన్ మలయాళ ఇండస్ట్రీకి (2012లో)ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'సెకండ్ షో'.రియల్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని వచ్చిన ఈ మూవీలో ప్రధానంగా 'ఇసుక అక్ర‌మ ర‌వాణాతో పాటు ఇత‌ర చీక‌టి వ్యాపారాల నేప‌థ్యంలో రూపుదిద్దుకుని కమర్షియల్గా సక్సెస్ అయింది.

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగులో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది.శ్రీనాథ్ రాజేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ మ‌ల‌యాళంలో రిలీజైన ప‌దేళ్ల త‌ర్వాత రిలీజయింది.యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఒక్క రోజులోనే ఈ మూవీ ట్రెండింగ్‌గా నిలిచింది.సెకండ్ షో మూవీ ద్వారా ప్రముఖ నటులు స‌న్నీ వేన్‌,గౌత‌మి నాయ‌ర్‌తో పాటు డైరెక్టర్ శ్రీనాథ్ రాజేంద్ర‌న్‌కు కూడా ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం.సెకండ్ షో మూవీ డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ కావడంతో దుల్కన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్(Lucky Baskhar) మూవీ రాబోతుంది. కాగా ఈ మూవీ పీరియాడికల్ జోనర్ లో సాగుతూ..ఒక  సామాన్యుడు..ఆ సామాన్యమైన విజయాలను ఎలా సాధించాడు..అందుకు అడ్డొచ్చిన అసమానతలు ఏంటనేది..ఈ మూవీ స్టోరీ లైన్ అని టాక్. ఇక కరెన్సీ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్  గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన  జి.వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.