నవంబరు 1 నుంచి షూటింగ్స్ బంద్!..నిర్మాతల మండలి వైఖరి సరికాదు: హీరో కార్తీ

నవంబరు 1 నుంచి షూటింగ్స్ బంద్!..నిర్మాతల మండలి వైఖరి సరికాదు: హీరో కార్తీ

నవంబరు 1వ తేదీ తర్వాత షూటింగ్స్కి అనుమతి లేదని తమిళ సినీ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటువంటి సంచలనమైన నిర్ణయాలను మండలి తీర్మానించిన నేపథ్యంలో..వారు తీసుకున్న వైఖరిపై నడిగర్‌ సంఘం కోశాధికారి హీరో కార్తీ ఖండించారు.

జూలై 30(మంగళవారం) కార్తీ విలేకర్లతో మాట్లాడుతూ..వేలాది మంది సినీ కార్మికుల జీవితాలకు సంబంధించిన ఈ నిర్ణయంపై కార్తీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తాజా నిర్ణయం అనేది సినీ ఇండస్ట్రీలోని అన్ని సంఘాలతో చర్చించాకే ఒక ఫైనల్ డెసిషన్ అనేది ఉండాలని అన్నారు. ఐతే, తమిళ నిర్మాతల మండలి హీరో ధనుష్‌తో సినిమా చేయాలంటే..నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది. కానీ, ధనుష్‌పై చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారని, ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి కంప్లైంట్ అనేది నడిగర్‌ సంఘానికి ఇప్పటివరకు రాలేదని తెలిపారు.

Also Read :- తెలుగు మూవీకి డబ్బింగ్ చెప్పిన బ్యూటీ..

ఏదేమైనా సినిమాను నమ్ముకుని బతికే నటుల వృత్తిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించడాన్ని ఆమోదించలేమని  వెల్లడించారు. త్వరలో ఈ విషయం గురించి నడిగర్ సంఘం తరఫున పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిర్మాతల మండలి లేవనెత్తిన ప్రశ్నలకు తగిన సమాధానాలతో ఓ నివేదిక సిద్ధం చేశామని, దానిని త్వరలో విడుదల చేస్తామని కార్తీ తెలిపారు. 

అసలేం జరుగుతోంది?

తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షతన రాష్ట్ర సినిమా థియేటర్ల యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా థియేటర్ల మల్టీఫ్లెక్స్‌ యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా పంపిణీదారుల సంఘం నిర్వాహకుల సమావేశం చెన్నైలో జూలై 29న సోమవారం జరిగింది. ఈ మీటింగ్ లో 6 కీలక అంశాలను లేవనెత్తారు. 

స్టార్ హీరోల మూవీస్ రిలీజైన 8 వారాలు తర్వాతే వాటిని ఓటీటీలో విడుదల చేయాలని, నటీనటులు, సాంకేతిక కళాకారులు అడ్వాన్స్‌ తీసుకున్న ఆ నిర్మాత చిత్రాన్ని ముందుగా కంప్లీట్ చేసిన తర్వాతే వేరే సినిమాలలో నటించాలని పేర్కొంది. 

అంతేకాకుండా ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ..ప్రస్తుతం జరుగుతున్న కొన్ని చిత్రాల షూటింగ్‌ పనులను అక్టోబరు 30వ తేదీలోపు మాత్రమే కంప్లీట్ చేయాలనీ..నటీనటులు, సాంకేతిక కళాకారుల వేతనాలు, ఇతర ఖర్చుల నియంత్రణ దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్న నేపథ్యంలో నవంబరు 1 నుంచి అన్ని సినిమాల షూటింగ్స్కి సంబంధించిన పనులను నిలిపివేయాలని తీర్మానించారు.

ప్రస్తుతం తమిళ సినీ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నిర్మాతల మండలి హీరో ధనుష్ ను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై నిర్మాతలు నడిగర్ సంఘాన్ని స్పందించలేదని..ఏకపక్షంగా నటులపై ఆంక్షలు సరికాదని.. నాజర్ అభిప్రాయపడ్డారు. తక్షణమే నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని నడిగర్ సంఘం అధ్యక్షుడు నటుడు నాజర్ ఆదేశించారు.