కత్తికన్నా పదునైన కళ్ళు.. కంగువా క్రేజీ అప్డేట్

కత్తికన్నా పదునైన కళ్ళు.. కంగువా క్రేజీ అప్డేట్

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) ప్రధాన పాత్రలో వస్తన్న పాన్ వరల్డ్ మూవీ కంగువా(Kanguva). దర్శకుడు శివ(Shiva) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations), స్టూడియో గ్రీన్(Studio green) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరో సూర్య డిఫరెంట్ లుక్ కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కు సంబందించిన అప్డేట్ ఇచ్చారు. కంగువా ఫస్ట్ గ్లింప్స్(Kanguva first glimpse) ను జులై 23న 12:01 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు "అతని కళ్ళు కత్తికన్నా పదునైనవి" అనే పవర్ఫుల్ క్యాప్షన్ ను ఇచ్చారు. ఓ పోస్టర్ లో సూర్య చురకత్తుల చూపులతో.. చాలా కొత్తగా, గంభీరంగా కనిపిస్తున్నారు. జెస్ట్ పోస్టరే ఈ రేంజ్ లో ఉందంటే.. రేపు ఫస్ట్ గ్లింప్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక కంగువా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.