ఘనంగా పీవీ సింధు నిశ్చితార్థం

భారత స్టార్ ఏస్ షట్లర్ పీవీ సింధు.. తనకు కాబోయే భర్త వెంకట దత్త సాయితో నిశ్చితార్థం చేసుకుంది. డిసెంబర్ 14, శనివారం సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. కాబోయే భర్తతో కలిసి సింధు కేక్ కట్ చేయడం ఫొటోలో కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోను సింధు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది.

డిసెంబర్ 22న ఆదివారం ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్ళికి భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు సమాచారం. ఇదివరకే ఈ జంట వీరిని తమ వివాహానికి విచ్చేయాలని ఆహ్వానించారు. పివి సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PV Sindhu (@pvsindhu1)