ఐపీఎల్‌‌‌‌కు షమీ దూరం

ఐపీఎల్‌‌‌‌కు షమీ దూరం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌–17 మొదలుకాకముందే గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ చీలమండ గాయంతో స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ షమీ మెగా లీగ్‌‌‌‌కు దూరం కానున్నాడు. సర్జరీ కోసం అతను యూకే వెళ్తున్నట్లు బీసీసీఐ వర్గాలు గురువారం తెలిపాయి. నవంబర్‌‌‌‌లో జరిగిన వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆస్ట్రేలియాతో చివరి వన్డే ఆడిన షమీ అప్పట్నించి ఆటకు దూరంగా ఉన్నాడు.

‘జనవరి చివరి వారంలో షమీ లండన్‌‌‌‌ వెళ్లి చీలమండకు ప్రత్యేకమైన ఇంజెక్షన్‌‌‌‌ తీసుకున్నాడు. మూడు వారాల తర్వాత లైట్‌‌‌‌గా రన్నింగ్‌‌‌‌ మొదలుపెట్టాడు. కానీ ఇంజెక్షన్‌‌‌‌ పని చేయలేదు. ఇప్పుడు సర్జరీ తప్ప మరో మార్గం లేదు. సర్జరీ కోసం వీలైనంత త్వరగా యూకే వెళ్లనున్నాడు. కాబట్టి అతను ఐపీఎల్‌‌‌‌లో ఆడలేడు’ అని బోర్డు సీనియర్‌‌‌‌ అధికారి ఒకరు పేర్కొన్నాడు. అన్నీ  అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్‌‌‌‌–నవంబర్‌‌‌‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌తో జరిగే టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు అతను అందుబాటులోకి రావొచ్చు.