ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్టార్ రైడర్ పవన్ షెరావత్ రికార్డు సృష్టించాడు. పీకేఎల్ తొమ్మిదో సీజన్ కోసం శుక్ర, శనివారాల్లో ముంబైలో జరిగిన ప్లేయర్ల ఆక్షన్‌లో షెరావత్‌ను తమిళ్ తలైవాస్ జట్టు ఏకంగా రూ. 2.26 కోట్లకు సొంతం చేసుకుంది. బెంగళూరు బుల్స్ వికాస్ ఖండోలాను రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది రూ. 1.65 కోట్లు పలికిన పర్దీప్ నర్వాల్ (యూపీ యోధా) రికార్డును ఈ ఇద్దరూ బ్రేక్ చేశారు. రెండ్రోజుల వేలంలో పుణెరి పల్టాన్ జట్టు ఫజల్ అత్రాచలి కోసం రూ. 1.38 కోట్లు ఖర్చు చేసింది. గున్మన్ సింగ్ (యు ముంబా రూ. 1.21 కోట్లు), పర్దీప్ నర్వాల్ (యూపీ యోధాస్ రూ. 90 లక్షలు) ఎక్కువ ధర పలికారు. 2018 ఆక్షన్‌లో రూ. 1.29 కోట్లు పలికిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఈసారి రూ. 10 లక్షలు పలికాడు. అతడిని జైపూర్ కొనుగోలు చేసింది.