ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ విషయంలో గందరగోళ పరిస్థితులు జరిగిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఔట్ పై ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు కోహ్లీ ఔట్ అంటుంటే.. మరికొందరు నాటౌట్ అయినా ఔట్ గా ప్రకటించి అన్యాయం చేశారని వాదిస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది. కోహ్లీ ఔట్ నిర్ణయం సరైనదేనని తేల్చేసింది.
"కోహ్లిని ఔట్ కావడానికి కారణం అతను క్రీజు వెలుపల నిలబడి ఉండటమే. సాధారణంగా బంతి నడుము ఎత్తులో ఉన్నప్పటికీ, కొహ్లీ క్రీజ్ ధాటి బయటకు రావడం వలన అది అంపైర్లు నో బాల్ గా ప్రకటించారు. ఒకవేళ కోహ్లీ క్రీజ్ వెలుపలే ఉంటే.. అది నడుము కన్నా ఎత్తులో ఉండేది. అని IPL అధికారిక టీవీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ఈ విషయంపై వివరణ ఇచ్చింది. విరాట్ కోహ్లీ నడుం హైట్ 1.04 మీటర్లు కాగా.. బంతి క్రీజ్ వద్దకు వెళ్లేటప్పటికి 0.92 మీటర్ల ఎత్తులో ఉంటుందని ట్రాకర్ తేల్చింది. ఒకవేళ కోహ్లీ క్రీజులోనే ఉండి ఉంటే.. ఆ బంతి నడుం కంటే కిందకు వచ్చేది. దీంతో అపైర్లు కోహ్లీని ఔట్ అని ప్రకటించారు.
అసలేం జరిగిందంటే..?
హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి అతనికే క్యాచ్ ఇచ్చాడు. అయితే.., ఆ బంతి ఫుల్ టాస్ రూపంలో కాస్త ఎత్తులో రావడంతో హైడ్రామా చోటు చేసుకుంది. నో- బాల్ కోసం కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరిగా నిర్ణయిస్తూ.. కోహ్లీది ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై విరాట్, డుప్లెసిస్ మరోసారి ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో చర్చించిప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. వారు ఔట్ అని తేల్చేశారు. దీంతో కోహ్లీ అసహనంతో పెవిలియన్‌కు వెళ్లాడు.
ఈ మ్యాచ్ లో కోహ్లీ 7 బంతుల్లోనే 2 సిక్సులు, ఒక ఫోర్ తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా ముగిసిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ పై ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 221 పరుగులు చేసింది.
Star sports#starsports pic.twitter.com/nK8iyGH6wL
— RVCJ Sports (@RVCJ_Sports) April 21, 2024