వరల్డ్ కప్ ఫైనల్ కు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఈ మెగా ఫైనల్ కు గ్రాండ్ గా క్లోజింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తుది సమరం జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి పది నిమిషాల ముందు భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది. ఈ గ్రాండ్ సమరానికి స్టార్ స్పోర్ట్స్ లైవ్ కవరేజ్ ఉదయం 7 గంటలకు ప్రసారం కానుంది.
మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా 7 గంటలు ముందు అంటే ఉదయం 7 గంటలకు ఈ లైవ్ ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ లో మనం వీక్షించవచ్చు. సాధారణంగా మ్యాచ్ కు ముందు లైవ్ కవరేజ్ గంట లేదా 2 గంటలు ఉంటుంది. కానీ ఈ సారి భారత్ ఫైన్ల కు చేరడంతో ఉదయం నుంచే యాంకర్లు, ఎక్స్ పర్ట్స్ మ్యాచ్ గురించి మనకు సమాచారం అందిస్తారు. 1:30కి టాస్ యధావిధిగా ఉంటుంది. ఒక మ్యాచ్ ఇంత త్వరగా లైవ్ టెలికాస్ట్ చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
మయంతి లంగర్ స్టార్ స్పోర్ట్స్ గ్లామర్ యాంకర్ గా సందడి చేయనుండగా.. సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్ తదితరులు మ్యాచ్ గురించి అనాలసిస్ చేస్తారు. ఈ 7 గంటలు ఇండియా వరల్డ్ కప్ జర్నీ, ప్రోగ్రామ్స్, ఇంటర్వూస్ లాంటిని జరుగుతాయి. ఈ మ్యాచ్ కు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు హాజరు కానున్నారు.