చండీగఢ్: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నామినేషన్ వేశారు. బుధవారం హర్యానాలోని జింద్ జిల్లా జులానా అసెంబ్లీ స్థానం నుంచి ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట కాంగ్రెస్ నేత, రోహ్‌తక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, సోనిపట్ ఎంపీ సత్పాల్ బ్రహ్మచారి ఉన్నారు.
వచ్చే నెల 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు కు గురువారం చివరి రోజు. ఫొగాట్నామినేషన్ అనంతరం దీపేందర్ హుడా మాట్లాడుతూ.. ఫొగాట్ భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు.
అలాగే, భూపిందర్ సింగ్ హుడా నాయకత్వంలో జులానాలోనే కాకుండా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధిస్తుంద ని విశ్వాసం వ్యక్తం చేశారు.