బెంగళూరులో స్టార్‌బక్స్‌ ఫౌండర్

స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సెయిగ్ల్ బెంగళూరుకు వచ్చారు. 2022 గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ నిమిత్తం బెంగళూరుకు వచ్చిన ఆయన గుర్తింపు పొందిన విద్యార్థి భవన్ హోటల్ ను సందర్శించారు. అక్కడి రుచులను ఆస్వాదించారు. అందరూ ఎంతో ఇష్టపడి తినే మసాల దోసెను ఆరగించారు. అనంతరం వేడి వేడి కాఫీ టేస్ట్ ను చూశారు. అక్కడి గెస్ట్ బుక్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు.

అద్భుతమైన అనుభవాన్ని సియాటెల్‌కు మోసుకెళ్తానంటూ బుక్‌లో రాసుకొచ్చారని విద్యార్ధి భవన్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 1943లో విద్యార్ధి భవన్ హోటల్ ఉండేది. చిన్న హోటల్ గా మొదలై బెంగళూరులో ఇప్పుడు అత్యంత ఫేమస్ హోటల్ లో ఒకటిగా నిలిచింది. ఇక అమెరికా వ్యాపారవేత్త అయిన జెవ్ సెయిగ్ల్ 1971లో స్టార్ బక్స్ ను స్థాపించిన వాళ్లలో ఒకరు. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. వైఎస్ ప్రెసిడెంట్ గా, డైరెక్టర్ గా వ్యవహరించారు. ప్రపంచంలోనే ఖరీదైన కాఫీలు స్టార్ బక్స్ లో లభిస్తుంటాయి.