ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా జాతీయ జట్టు ప్రయోజనాల కోసం ఐపీఎల్ కి దూరంగా ఉంటూ వస్తున్న ఈ స్పీడ్ స్టార్ 2024 లో జరగబోయే ఆక్షన్ లోకి రానున్నాడు. అయితే స్టార్క్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది అమెరికా ఆతిధ్యమిస్తున్న టీ 20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్ లాంటి మెగా టోర్నీని ఉపయోగించుకున్నట్లు స్టార్క్ స్వయంగా వెల్లడించాడు.
చివరిసారిగా ఆర్సీబీ జట్టులో
స్టార్క్ చివరిసారిగా 2015 లో భారీ ధరకు ఆర్సీబీ జట్టులో చేరాడు. 2015, 2016 సీజన్లు ఆడిన స్టార్క్ 2017 లో గాయంతో ఐపీఎల్ కి దూరమయ్యాడు. దీంతో తనకి లీగ్ ల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ ఆసీస్ జట్టుతోనే ఉన్నాడు. గతేడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండడంతో స్టార్క్ ఐపీఎల్ ఆడలేదు. అయితే తాజాగా స్టార్క్ తీసుకున్న నిర్ణయం కూడా జాతీయ జట్టు ప్రయోజనాల కోసమే అని ఈ యార్కర్ల వీరుడు చెప్పకనే చెప్పాడు.