Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?

Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్  త్వరలో మన దేశంలో ప్రారంభం కాబోతున్నాయి.. అయితే స్టార్ లింక్ కంటే ముందే BSNL  శాటిలైట్ D2D సేవలను దేశంలో అందుబాటులోకి తెచ్చింది. దీంతో స్టార్ లింక్ సేవలు, బీఎస్ ఎస్ ఎల్ శాటిలైట్ సేవలలో ఏదీ బెటర్ అని సందేహాలు యూజర్లలో తలెత్తుతున్నాయి. ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ కి, BSNL శాటిలైల్ సర్వీస్ లకు మధ్య తేడా ఏంటో, ఏదీ ఇంటర్నెట్ ను వేగంగా అందిస్తోంది పోల్చి చూద్దాం. 

త్వరలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఇండియాలో ప్రారంభం కానుంది. శాటిలైట్ కమ్యూనికేషన్లకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పెక్ట్రమ్ ను కేటాయిస్తే డిసెంబర్ 15నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. స్టార్ లింక్ గనక ఇండియాలో ప్రవేశిస్తే తమ పరిస్థితి ఏంటని ఇండియన్ టెలికం దిగ్గజాలు అయిన ఎయిర్ టెల్, జియోలను  ఆందోళనకు గురి చేస్తుంది. 

వాస్తవానికి 2022 అక్టోబర్ నుంచే భారత్ లో తమ శాటిలైట్ సేవలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఎలాన్ మస్క్ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటినుంచి జియో, ఎయిర్ టెల్, అమెజాన్ లు శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పరిధిలోని టెలికం సర్వీస్ BSNL కూడా శాటిలైట్ సేవలను ప్రారంభించింది. 

స్టార్‌లింక్,BSNL ఉపగ్రహ సేవలను పోల్చి చూస్తే.. 

BSNL శాటిలైట్ ఇంటర్నెట్ ViaSat జియో స్టేషనరీ L బ్యాండ్ ఉపగ్రహాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఇవి భూమి చుట్టూ 36వేల కిలోమీటర్ల కంటె ఎక్కువ ఎత్తులో కక్ష్యలో తిరుగుతుంటాయి. ఇది అంతరిక్షంలో ఉండే పెద్ద సెల్ టవర్ల వలె పనిచేసే వియోసాట్ శాటిలైట్లను వినియోగించడం ద్వారా సేవలందిస్తుంది. BSNL  D2D సేవలతో కస్టమర్లకు స్ట్రీమింగ్ సమయంలో బఫరింగ్, వీడియో గేమింగ్, వీడియో కాల్స్ లో ఇంటర్నెట్ వేగం.. స్టార్ లింక్ శాటిలైట్ సర్వీస్ తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉండొచ్చు. 

స్టార్ లింక్ ఎలా పనిచేస్తుందంటే.. 

స్టార్ లింక్ శాటిలైట్లు భూమికి దగ్గరగా పనిచేస్తాయి. కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ తక్కువ దూరం ఎక్కువ కనెక్టివిటీని పెంచడంలో అనుమతిస్తుంది. ఇంటర్నెట్ యాక్సెస్ వేగంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు ఎలాన్ మస్క్ కంపెనీ దాదాను 42వేల కాంపాక్ట్ శాటిలైట్లను ప్రయోగించింది. వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్టివిటీ, నెట్ వర్క్ కవరేజీని అందిస్తుంది. Airtel oneweb,BSLN Viasat, అమెజాన్ కూపర్ వంటి ఇతర శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు కూడా భూమికి దిగవ కక్ష్యలోనే పనిచేస్తాయి.