ధర్మసాగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధర్మసాగర్, వెలుగు: తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని డీపీఎం అనిల్ కుమార్​అన్నారు. సోమవారం ధర్మసాగర్ మండల పరిధిలోని ధర్మసాగర్, జానకీపురం, క్యాతంపల్లి గ్రామాల్లో పీఎసీఎస్–1, ఐకేపీ ఆధ్వర్యంలో 3 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్ కుమార్, ఏవో పద్మ, ఏపీఎం అనిత, సీసీలు, రైతులు పాల్గొన్నారు.