ఒడిశాలో లాక్ డౌన్ తో మూతపడిన ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 66 రూట్లలో బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో బస్ స్టేషన్లలో హడావుడి కనిపిస్తోంది. ఒడిశాలోని ప్రధాన పట్టణాలకు మాత్రమే బస్సులు నడిపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తున్నామన్నారు. అలాగే బస్సులోకి ఎక్కేముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. బస్సు బయలుదేరే ముందు.. తిరిగి వచ్చాక.. శానిటైజ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.