ఉన్నత పాఠశాలలో సైన్స్​ ల్యాబ్​ ప్రారంభం

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి  మండలం గట్లనర్సింగాపూర్​ గ్రామంలోని గుండవరపు సత్యవతి శ్రీనువాస్​రావు మెమోరియల్​ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ. 25 లక్షలతో కావేరీ సీడ్స్​ నిర్మించిన సైన్స్​ ల్యాబ్​ను ఆ  కంపెనీ ఎండి  గుండవరపు భాస్కర్​రావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయిలో విద్యను అందించేందుకు ఈ ల్యాబ్​ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.  పాఠశాలను దత్తత తీసుకొని   సకల సౌకర్యాలు  కల్పిస్తున్నట్టు వివరించారు.   కార్యక్రమంలో  స్కూల్​ ప్రిన్సిపాల్​ కుమారస్వామి, ఇన్​చార్జి రాంగోపాల్​రావు పాల్గొన్నారు.