ఆదిలాబాద్​ లో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన కలెక్టర్

ఆదిలాబాద్​ లో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన కలెక్టర్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని.. మార్కెట్, రెవెన్యూ సిబ్బందిని నియమించామని ఆదిలాబాద్ కలెక్టర్​రాహుల్​రాజ్​పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​యార్డులో పత్తి కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. ముందుగా పత్తి వేలంపాటలో రైతులు, ట్రేడర్లు, అధికారులు పాల్గొని క్వింటాలుకు రూ.7,020 మద్దతు ధర నిర్ణయించారు.

అనంతరం కలెక్టర్ కాంటకు పూజలు నిర్వహించి, రైతులను సన్మానించి తూకం ప్రారంభించారు. జిల్లాలో రైతులు పండించే పత్తి నాణ్యమైనదని, దేశంలోనే జిల్లా పత్తికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ అధికంగా ఉంటుందని, 8 నుంచి 12 శాతం తేమతో ట్రేడర్లు రూ.7,100తో కొనుగోళుకు ముందుకు వచ్చారన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, రైతు సంఘాల నాయకులు, ట్రేడర్లు, రైతులు పాల్గొన్నారు.