
ఎలాన్ మస్క్..అమెరికా టెక్ దిగ్గజం..వరల్డ్ ఫేమస్ కార్లకంపెనీ టెస్లా ఓనర్..స్పేస్Xతో అంతరిక్షాన్ని ఏలుతున్న కింగ్..ప్రపంచంలో ఎలాన్ మస్క్ పేరు తెలియని వారుండరు. అంతలా పేరు సంపాదించాడు.. అయితే ఆ ఘనత అంత ఈజీగా రాలేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్ అమెరికా కార్పొరేట్ రంగంలో అడుగుపెట్టడం అంత తేలికగా ఏం జరగలేదు. ఎన్నో పోరాటాలు చేస్తేగానీ నిలదొక్కుకోలేదు. బిజినెస్ ప్రారంభించిన తొలిరోజుల్లో తాను పడ్డ కష్టాలను ఎదుర్కొన్న ఎలాన్ మస్క్.. ప్రపంచ నంబర్ వన్ గా ఎదిగిన క్షణాల వెనక ఉన్న హిస్టరీని, సక్సెస్ స్టోరీని ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..
90ల మధ్యలో ఇన్నోవేషన్ ఎరా గురించి మాట్లాడుతూ..మస్క్ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం తనకు ఎప్పుడూ ఇష్టం లేదని చెప్పాడు. బదులుగా అతను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత నెట్‌స్కేప్‌లో ఉద్యోగం పొందడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అతను మార్క్ ఆండ్రీస్సెన్‌ను స్నేహితుడు అని పిలుచుకోవచ్చు కానీ అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. “నేను మెయిల్ చేసిన నా రెజ్యూమ్‌కు వారు (నెట్‌స్కేప్) స్పందించలేదు. నేను కొంత ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్‌ను వ్రాస్తాను' అని అనుకున్నాను.1995లో ఇంటర్నెట్‌లో మొదటి మ్యాప్‌లు,దిశలను రాశాను.” అని ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు.
2012లో బిజినెస్ మ్యాన్ కెవిన్ రోజ్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ తన కెరీర్ ప్రారంభం, ఒడిదుడుకుల గురించి గుర్తు చేసుకున్నారు. తాను ఎవరితోనైనా మాట్లాడేందుకు సిగ్గుపడేవాడినని చెప్పుకొచ్చిన మస్క్.. తాను తొలిసారి నెట్ స్కేప్ లో ఉద్యోగానికి అప్లయ్ చేస్తే రిజెక్ట్ చేశారని అన్నారు. నెట్ స్కేప్ ఓనర్ మార్క్ ఆండ్రీసెన్ ఇప్పుడు మంచి స్నేహితుడే అయినప్పటికీ అప్పట్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయన్నారు. నెట్ స్కేప్ ఒక్కటే కాదు చాలా కంపెనీలు తిరస్కరించాయన్నారు. అదే తనను కంపెనీ ప్రారంభించేందుకు ప్రోత్సహించిందన్నారు ఎలాన్ మస్క్.
1992లో జిప్2ను ప్రారంభించారు ఎలాన్ మస్క్. తద్వారా అంచెలంచెలుగా ఎదిగారు. చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు పాలనలో సలహాలిస్తున్నాడు.మస్క్ జీవితం.. సక్సెస్ సాధించిన అంత సులభం కాదు..ఎంతో కృషిచేయాలి. నిరంతరం శ్రమించారు.. ఎన్నో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఓ మెసేజ్ను అందిస్తోంది.