అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్.. ఈ అర్థరాత్రి నుంచే.. బెస్ట్ ఆఫర్లు ఇవే..

ఆగస్టు 15, భారత స్వాతంత్ర్య దినోత్సవం వస్తుందంటే చాలు ఈ- కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ను ప్రకటించింది. ఈ సేల్ నేటి అర్థరాత్రి నుంచి ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రానుంది. ఆగస్ట్ 6 నుంచి 11 వరకూ అందరికీ అందుబాటులోకి రానున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్లో పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్స్ను అమెజాన్ ప్రకటించింది. ల్యాప్ టాప్స్పై 45 శాతం వరకూ, టీవీలపై 65 శాతం వరకూ, ఇక స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే పలు మోడల్స్పై భారీ డిస్కౌంట్ను అమెజాన్ ప్రకటించిది.

ఈ ఫ్రీడం సేల్ లో ఐఫోన్ 13 రూ.47,999కే రానుంది. వన్ ప్లస్ ఆర్ మోడల్ రూ.40,999కే వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. Redmi 13C 5G, Nord CE 4 Lite, realme narzo N61, Galaxy S21 FE 5G, OnePlus Nord 4 5G, Galaxy M35 5G, Honor 200, Lava Blaze X, Redmi 13 5G, Realme GT 6T 5G, iPhone 15, realme narzo 70 Pro మోడల్ స్మార్ట్ ఫోన్లతో పాటు పలు మొబైల్స్ ఇప్పుడున్న ధరలతో పోల్చితే తక్కువ ధరలకే అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఎస్బీఐ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందే వెసులుబాటును కస్టమర్లకు అమెజాన్ కల్పించింది. వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్లపై 65 శాతం వరకూ డిస్కౌంట్ పొందే అవకాశం ఈ సేల్లో కొనే కస్టమర్లకు అందుబాటులో ఉంది.