
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది తింటుంటారు. కానీ.. తినే టైంకి అవి ఫ్రెష్‌గా, న్యూట్రిషియస్గా ఉన్నాయా? లేదా? అనేది ఎంతమంది గమనిస్తారు. ఫామ్ నుంచి షాప్‌కి వచ్చేలోపు రకరకాల కారణాల వల్ల కొన్ని గుడ్లు పాడైపోతాయి. అందుకే తింటుంటే కొన్నిసార్లు దుర్వాసన వస్తుంటుంది. లేదంటే టేస్ట్ మారిపోతుంటుంది. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. బ్రాండ్ ట్యాగ్‌తో క్వాలిటీ గుడ్లను అమ్మాలి అనుకున్నారు ముగ్గురు ఫ్రెండ్స్. అనుకున్నట్టుగానే స్టార్టప్ పెట్టి.. ప్రతి రోజూ లక్షల గుడ్లను అమ్ముతూ ఏటా కోట్లు సంపాదిస్తున్నారు.
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది తింటుంటారు. కానీ.. తినే టైంకి అవి ఫ్రెష్‌గా, న్యూట్రిషియస్గా ఉన్నాయా? లేదా? అనేది ఎంతమంది గమనిస్తారు. ఫామ్ నుంచి షాప్‌కి వచ్చేలోపు రకరకాల కారణాల వల్ల కొన్ని గుడ్లు పాడైపోతాయి. అందుకే తింటుంటే కొన్నిసార్లు దుర్వాసన వస్తుంటుంది. లేదంటే టేస్ట్ మారిపోతుంటుంది. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. బ్రాండ్ ట్యాగ్‌తో క్వాలిటీ గుడ్లను అమ్మాలి అనుకున్నారు ముగ్గురు ఫ్రెండ్స్. అనుకున్నట్టుగానే స్టార్టప్ పెట్టి.. ప్రతి రోజూ లక్షల గుడ్లను అమ్ముతూ ఏటా కోట్లు సంపాదిస్తున్నారు.
కరోనా టైంలో..
వ్యాపారం మొదలుపెట్టిన చాలా తక్కువ టైంలోనే కరోనా వచ్చింది. దాంతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. జనాల్లో మంచి ఫుడ్ తినాలనే అవగాహన పెరిగిన తర్వాత గుడ్లకు గిరాకీ పెరిగింది. ఫామ్స్‌లో యూవీ శానిటైజేషన్ లాంటివి ఏర్పాటు చేశారు. క్వాలిటీ ఎగ్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మొదట్లో నార్త్ ఇండియాలోని 6 ప్రధాన నగరాల్లో మాత్రమే బిజినెస్ చేశారు.
కోళ్ల ఫామ్‌తో మొదటి అడుగు
స్టార్టప్ ఐడియాను అభిషేక్ తనతోపాటు ఐఐటీలో చదువుకున్న ఫ్రెండ్స్ ఉత్తమ్ కుమార్, ఆదిత్య సింగ్‌తో పంచుకున్నాడు. వాళ్లకు కూడా నచ్చడంతో 2017లో ‘ఎగ్గోజ్ న్యూట్రిషియన్’ పేరుతో కంపెనీ పెట్టారు. కానీ.. ‘‘అప్పట్లో మాకు కోళ్ల పెంపకం గురించి ఏమీ తెలియదు. ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు బిహార్‌లో 12,000 కోళ్లతో ఒక ఫామ్‌ని ఏర్పాటు చేశాం. ఉత్తమ్ ఫ్యామిలీ బిహార్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఉండేది. అందుకే ఆ ప్లేస్‌ని ఎంచుకున్నాం.
మేము కూడా మా కార్పొరేట్ మెట్రోపాలిటన్ లైఫ్ స్టయిల్ని విడిచిపెట్టి కొన్నాళ్లు ఆ గ్రామంలోనే ఉండి, కోళ్ల పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు అభిషేక్. కోడి పిల్లలను తీసుకురావడం నుంచి, అవి పెరిగి గుడ్లు పెట్టేవరకు వాళ్లు అక్కడే ఉన్నారు.
మూడు సంవత్సరాల పాటు అలా కోళ్ల పెంపకం మీద రీసెర్చ్ చేశారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. ఫామ్‌లో ఎలాంటి టెక్నాలజీ వాడాలి? బ్రీడ్, ఫీడ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇలాంటివన్నీ డిసైడ్ అయ్యారు. 2019 చివరి నాటికి 6 ఫామ్స్(సుమారు 80 వేల కోళ్లు)లో క్వాలిటీ ప్రమాణాలు పాటించి గుడ్ల ఉత్పత్తి మొదలుపెట్టారు. 2020లో సొంత బ్రాండ్ పేరుతో మార్కెట్లో అమ్మారు.
సక్సెస్ ఫార్ములా
ఈ స్టార్టప్ సక్సెస్‌కు ముఖ్య కారణం.. ఫామ్‌లో సేకరించిన గుడ్లని 24 గంటల్లో వినియోగదారులకు చేర్చడమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక్కరోజులోపే గుడ్లను స్టోర్లకు చేరుస్తారు. అంతేకాదు.. వాళ్లు గుడ్లు సేకరిస్తున్న ఫామ్స్‌లోని కోళ్లకు 100 శాతం నేచురల్ ఫీడ్ ఇస్తున్నారు. దాంతో కోళ్లకు వ్యాధులు రావడం లేదు.
యాంటీ బయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. క్వాలిటీ గుడ్లు పెడుతున్నాయి. మార్కెట్లో దొరికే మామూలు గుడ్లతో పోలిస్తే.. వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులకు కూడా లాభాలు వస్తున్నాయి. ఎగ్గోజ్ గుడ్లలో తెల్లసొన చిక్కగా, పచ్చసొన నారింజ రంగులో ఉంటుంది.
ప్రొటీన్, విటమిన్ డి, లుటీన్, విటమిన్ ఎ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైగా.. గుడ్లకు 11 రకాల క్వాలిటీ చెకింగ్స్ చేస్తారు. ముఖ్యంగా బ్యాక్టీరియా టెస్ట్, ఫామ్ ఆడిట్‌లు, టెంపరేచర్, ఫ్రెష్‌నెస్ టెస్ట్, షెల్ దృఢత్వం, యూవీ శానిటైజేషన్ లాంటివి చేయడం వల్ల అన్ని గుడ్లు ఒకే సైజు, క్వాలిటీతో వస్తాయి.
నెలకు 40 లక్షలు
ప్రస్తుతం ఎగ్గోజ్ ఢిల్లీ-ఎన్‌సీఆర్, జైపూర్, చండీగఢ్, లక్నో, ఇండోర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి అన్ని ప్రధాన నగరాల్లో గుడ్లను అమ్ముతోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా అమ్మకాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ లాంటి క్విక్ కామర్స్ స్టోర్లలో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రస్తుతం నెలకు 40 లక్షల గుడ్లను అమ్ముతున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2-3 రెట్లు వృద్ధి సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఇండియాలోని టాప్ 50 నగరాల్లో విస్తరించేందుకు అడుగులు వేస్తున్నారు.
రైతుల నమ్మకాన్ని..
వ్యాపారం మొదలుపెట్టిన తొలి దశలో కోళ్ల ఫారాల రైతుల నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టమైంది. అభిషేక్ చెప్పే విధానంలో కోళ్లను పెంచడం, గుడ్లను సేకరించడం చాలా ఖర్చుతో కూడిన పని. అందుకే రైతులు వెనుకడుగు వేశారు. కానీ.. అభిషేక్ వాళ్లకు అర్థమయ్యేలా వివరించి ఒప్పించాడు.
కచ్చితంగా తానే ఎగ్స్ కొంటానని, మార్కెట్ కంటే ఎక్కువ ధర ఇస్తానని హామీ ఇచ్చాడు. అప్పటినుంచి ‘ఎగ్గోజ్’ రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కోళ్ల కోసం రసాయనాలు లేని ఫీడ్, వైద్య సంరక్షణ, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాల ద్వారా సాంకేతిక సాయం అందిస్తున్నారు. ఈ విధానం వల్ల రైతుల ఆదాయం దాదాపు 50 శాతం పెరిగిందని ఎగ్గోజ్ వ్యవస్థాపకులు చెప్తున్నారు.
మరిన్ని ప్రొడక్ట్స్
ఎగ్గోజ్ కేవలం గుడ్ల అమ్మకాలతోనే ఆగిపోలేదు. ఈ మధ్య ఎగ్ బేస్డ్ స్నాక్స్‌ను కూడా తీసుకొచ్చింది. వాటిలో ఎగ్ బుర్జీ మోమోస్, ఎగ్ నగ్గెట్స్, ఎగ్ బర్గర్ లాంటివి ఉన్నాయి. ఆరోగ్యకరమైన శ్నాక్స్ కావడంతో బాగా అమ్ముడుపోతున్నాయి. అంతేకాకుండా విటమిన్ డి, బి12 ఎక్కువగా ఉండే ప్రత్యేకమైన గుడ్లను కూడా అమ్ముతున్నారు.