Electric Air Taxi : బైక్,ఆటో, కారు ట్యాక్సీలేనా..విమాన ట్యాక్సీలూ వచ్చేస్తున్నాయోచ్..

Electric Air Taxi : బైక్,ఆటో, కారు ట్యాక్సీలేనా..విమాన ట్యాక్సీలూ వచ్చేస్తున్నాయోచ్..

ఒకప్పుడు ఎక్కడికన్నా ప్రయాణించాలంటే.. గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు ఉపయోగించేవారు. ఇప్పుటివరకు మనం బైక్ టాక్సీలు,ఆటో టాక్సీలు, కారు టాక్సీలు చూశాం.. ఓలా, ఊబర్ వంటి ఆన్ లైన్ టాక్సీ యాప్ ల ద్వారా బుక్ చేసుకొని వెళ్తుంటాం.. ఈ మధ్య కాలంలో రద్దీ ఎక్కువగా ఉండటంలో వాటిలో ప్రయాణం కూడా కొంచెం ఇబ్బందిగానే మారింది. అయితే అందరికి ఓ గుడ్ న్యూస్.. త్వరలో ఎయిర్ టాక్సీలు కూడా రాబోతున్నాయి. మద్రాస్ కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ ఎయిర్ టాక్సీలను తయారు చేస్తోందట.. పైగా అవి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలట.. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.. 
  
నగరాల్లో రద్దీని తగ్గించే మార్గాలపై అన్వేషిస్తున్న చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ ePlane .. వచ్చే ఏడాది అంటే 2025 మార్చి నాటికి ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీలను తీసుకురావడానికి సిద్ధమైంది. మద్రాస్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) నుంచి వచ్చిన ఈ స్టార్టప్ కంపెనీ రాబోయేకొన్ని నెలల్లో కమర్షియల్ టాక్సీలుగా డ్రోన్లను అభివృద్ది చేయాలని రంగంలోకి దిగింది. 206 కిలోల వరకు పేలోడ్ లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన డ్రోన్ టాక్సీలను తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. 

మొదట మూడు లేదా నాలుగు సీట్ల గల eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్) విమానంగా ఈ డ్రోన్లను అభివృద్ది చేస్తారట. ముఖ్యంగా ఎయిర్ అంబులెన్స్ గా ఉపయోగించాలని భావిస్తున్నారు.eVTOLలతో  60 నిమిషాలు పట్టే ప్రదేశానికి చేరుకోవడానికి కేవలం 14 నిమిషాలు మాత్రమే చేరుకోవచ్చట. eVTOLలతో పట్టణ ప్రాంతాలలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుందట.ఇది 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఎగరగలదు. 

మరోవైపు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ కూడా US-ఆధారిత ఆర్చర్ ఏవియేషన్‌తో కలిసి 2026 నాటికి భారతదేశంలో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. దేశ రాజధానిలోని కన్నాట్ ప్లేస్ నుండి హర్యానాలోని గురుగ్రామ్ వరకు ప్రయాణీకులను తరలించే లక్ష్యంగా ఈ ఎయిర్ టాక్సీని తయారు చేస్తున్నారట.వలం 7 నిమిషాల్లో ఈ  ప్రాంతాల మధ్య ప్రయాణించొచ్చట. 

ఎయిర్ టాక్సీలు వస్తే సమయం, ట్రాపిక్ ఇబ్బందులు, అత్యవసర సమయాల్లో అంబులెన్సులుగా ఎయిర్ టాక్సీలు ఎంతో ఉపయోగంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ విషయం తెలిసిన వారంతా..