ఈ 4 స్టార్టప్​లలో మస్తు జాబ్స్​

 ఈ 4 స్టార్టప్​లలో మస్తు జాబ్స్​

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్​ మార్కెట్లలో అడ్డంకులు ఉన్నప్పటికీ, మనదేశానికి చెందిన కొన్ని స్టార్టప్​లు పెద్ద సంఖ్యలో కొలువులు ఇస్తున్నాయి. ఎక్కా ఎలక్ట్రానిక్స్, పార్క్​ ప్లస్​,  బోర్జో వంటివి పెద్ద సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. వచ్చే ఏడాది ఇవి భారీ ఎత్తున విస్తరించడానికి ప్లాన్లను రెడీ చేసుకున్నాయి. ఇందుకు భారీగా ఉద్యోగులు అవసరం కాబట్టి నియామకాలు జరుపుతున్నాయి. అంతేకాకుండా, ఈ  స్టార్టప్‌‌లు కొత్త మార్కెట్‌‌లలోకి ప్రవేశించడానికి అవసరమైన ప్రతిభ కోసం చూస్తున్నాయి.

ఎక్కా ఎలక్ట్రానిక్స్

ఎక్కా ఎలక్ట్రానిక్స్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది.  ఒక సంవత్సరంలో 1,600–-1,800 మందిని తీసుకోవాలని యోచిస్తోంది. ఎల్‌‌ఈడీ టీవీ తయారు చేసే ఈ సంస్థ ఉత్తరప్రదేశ్‌‌లోని నోయిడాలో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో  కొత్త తయారీ యూనిట్‌‌ను నిర్మించనుంది. “మేం ఎల్‌‌ఈడీ టీవీల తయారీని కొనసాగిస్తూనే, కొత్త ప్రొడక్టులనూ తీసుకొస్తాం. మరిన్ని వినియోగదారుల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తాం. ఈ డిమాండ్‌‌లను తీర్చడానికి మా ఉద్యోగుల సంఖ్యను పెంచుతాం. ఐటీఐ, ఇంజనీరింగ్​ చేసిన వాళ్లు మాకు ఎక్కువగా కావాలి. ప్రొడక్షన్​, ఇన్వెంటరీ మేనేజ్​మెంట్​, గిడ్డంగులు, మెటీరియల్​ మేనేజ్​మెంట్​కోసం వీరిని తీసుకుంటాం” అని  ఎక్కా ఎలక్ట్రానిక్స్ ఫౌండర్​  డైరెక్టర్ సాగర్ గుప్తా చెప్పారు.   

పార్క్​ప్లస్​

ఆటో-టెక్ స్టార్టప్ పార్క్ ప్లస్​ రాబోయే ఆరు నెలల్లో 250–-300 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. వీరిలో దాదాపు 100 స్థానాలను టెక్కీలకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. సంస్థ ప్రస్తుతం తన ఏఐ, ఎంల్,​ డేటా సైన్స్ బృందాన్ని విస్తరించాలని చూస్తోంది.  పార్క్ ప్లస్​ కో–ఫౌండర్​ హితేష్ గుప్తా మాట్లాడుతూ దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లకు తప్పనిసరిగా మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్‌‌డ్ అనలిటిక్స్, అడ్వాన్స్‌‌డ్ మ్యాథ్, ప్రోగ్రామింగ్ (పైథాన్, గోలాంగ్), డేటా విజువలైజేషన్‌‌పై లోతైన అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కంప్యూటర్ సైన్స్ లేదా ఇతర సంబంధిత విభాగంలో బీటెక్ తప్పనిసరి అని గుప్తా
వివరించారు.

బోర్జో

లాజిస్టిక్స్ సంస్థ బోర్జో కొత్త సంవత్సరంలో 100–-120 మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. ప్రపంచస్థాయిలో, సొంతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించడానికి బోర్జో ప్రయత్నిస్తోంది. కొత్త నియామకాలలో 85 శాతం మందిని సహాయక బృందాన్ని బలోపేతం చేయడానికి, అమ్మకాల ప్రయత్నాలను బలోపేతం చేయడానికి కేటాయిస్తారు.  సాఫ్ట్​వేర్​/యాప్స్​ డెవెలప్​మెంట్​, ఆపరేషన్స్​, తదితర విభాగాల కోసం  టాలెంట్​ను వెతుకుతోంది.  తన టీమ్​కు స్కిల్స్​ను పెంచడంలో సహాయపడగల సీనియర్-స్థాయి సాఫ్ట్​వేర్​/యాప్స్​డెవెలప్​మెంట్ ఎక్స్​పర్టుల కోసం చూస్తోంది.   

రూబిక్​ డేటా సైన్స్

 టెక్ స్టార్టప్ రూబిక్స్ రాబోయే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో  సుమారు 60-–75 మంది కొత్త టీమ్ మెంబర్‌‌లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సేల్స్,  బిజినెస్ డెవలప్‌‌మెంట్, డేటా అనాలిసిస్, ప్రోడక్ట్ డెవలప్‌‌మెంట్, రిస్క్ అనలిటిక్స్, ఆపరేషన్స్ మేనేజ్‌‌మెంట్, ఫైనాన్స్ అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్, కలెక్షన్ మేనేజ్‌‌మెంట్, ఫైనాన్స్ లీడర్‌‌షిప్  ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ విభాగాల కోసం దీనికి ఉద్యోగులు  కావాలి.  సాంకేతిక నైపుణ్యాన్ని భారీగా పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రూబిక్స్ డేటా సైన్సెస్​లో హెచ్​ఆర్​బీపీ మేనేజర్ స్వప్నిల్ మానే అన్నారు. ప్రొడక్షన్​ డెవెలప్​మెంట్​, రిస్క్ అనలిటిక్స్, టెక్నాలజీ, సేల్స్  ఫైనాన్స్ ఫంక్షన్‌‌లపై ఇది ఫోకస్​ చేస్తుంది. డేటా ఎనాలసిస్ కూడా​ రూబిక్స్ కార్యకలాపాలకు కీలకమని స్వప్నిల్​ మానే వివరించారు.