నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం అయిన తిప్పన విజయసింహారెడ్డి గురువారం నల్గొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా విజయసింహ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేయాలని గుత్తా సూచించారు.
నోముల నర్సింహయ్యకు నివాళి
హాలియా, వెలుగు : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య వర్ధంతిని నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం నర్సింహయ్య కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నాయకులు ఎడవల్లి విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆకుల సోమన్న మిత్రమండలి ఆధ్వర్యంలో నర్సింహయ్య వర్ధంతిని నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, శాలిగౌరారం మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తేజస్వి హాజరై నర్సింహయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, జెల్ల రేణుగౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
ముగ్గురు నల్గొండ జిల్లావాసులకు డాక్టరేట్
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.సాగర్‌కు జేఎన్టీయూ డాక్టరేట్ ప్రకటించింది. ఈయన ప్రొఫెసర్ సాహూ ఛత్రపతి పర్యవేక్షణలో ‘ఎనర్జీ ఎఫిషియంట్ నైబర్ నోడ్ డిటెక్షన్ ఆల్గారిథమ్స్ ఫర్ వైర్‌లెస్ సెన్సర్ నెట్‌వర్క్’ అనే అంశంపై పరిశోధన చేశారు. డాక్టరేట్ అందుకున్న సాగర్‌ను ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ తుమ్మ కృష్ణారావు, ప్రిన్సిపాల్ లేఖ అభినందించారు. నల్గొండ జిల్లా అప్పాజిపేటకు చెందిన రాసమల్ల భాగ్యలక్ష్మికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. యూనివర్సిటీ పీజీ సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి పర్యవేక్షణలో జియాలజీలో ‘హైడ్రోజియోకెమికల్ ఎవల్యూషన్, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ, మార్ఫోమెట్రిక్ అనాలసిస్ ఆఫ్ బ్రాహ్మణవెల్లంల వాటడ్ షెడ్ నల్గొండ జిల్లా’ అంశంపై పరిశోధన చేశారు. దీంతో యూనివర్సిటీ నుంచి గురువారం ఆమెకు డాక్టరేట్ అందజేశారు. అలాగే ‘సినారే ఈ దశాబ్ది కవిత్వం మానవీయ విలువలు’ అనే అంశంపై ప్రొఫెసర్ మసన చెన్నప్ప పర్యవేక్షణలో పరిశోధన చేసిన మర్రిగూడ మండలం శివన్నగూడకు చెందిన లెంకలపల్లి పద్మజకు ఉస్మానియూ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.
కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి
నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. నల్గొండ జిల్లా కనగల్‌లో గురువారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు వీరేల్లి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు పులకరం భిక్షం, మండల ఇన్‌చార్జి పల్లెబోయిన శ్యాంసుందర్, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్‌రెడ్డి, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ తిరందాసు కనకయ్య, సైదులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బారి అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వేంకటేశ్వర డిగ్రీ కాలేజీ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫీజులు కట్టలేక పేద స్టూడెంట్లు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించి సూర్యాపేట డిగ్రీ కాలేజీతో పాటు, భానుపురి యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే స్టూడెంట్లథో కలిసి మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా మానవహారం కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగడంతో పోలీసులు వచ్చి లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుండాల సందీప్, జనసేవాసమితి అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్‌నాయుడు, గిరిజన శక్తి రాష్ట్ర నాయకుడు ధరావత్ వెంకటేశ్ నాయక్ పాల్గొన్నారు.