కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర

కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర
  • రాష్ర్ట ఆగ్రో ఇండస్ట్రీస్​ చైర్మన్​ కాసుల బాల్​రాజ్

బీర్కూర్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని రాష్ర్ట ఆగ్రో ఇండస్ర్టీస్​ చైర్మన్​ కాసుల బాల్​రాజ్​ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్​ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు హనుమంత రావు, మాజీ ఎంపీపీ రఘు, మాజీ అధ్యక్షుడు అప్పారావు,  మాజీ సర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

భిక్కనూరు: భిక్కనూరు మార్కెట్​గంజ్​ఆవరణలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సింగిల్​విండో చైర్మన్​ గంగల భూమయ్య  ప్రారంభించారు.  కార్యక్రమంలో తహసీల్దార్​ శివప్రసాద్, సీఈవో నర్సింహులు, విండో వైస్​ చైర్మన్​ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ర్ట కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్​రెడ్డి, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్​ రెడ్డి, మాజీ సర్పంచ్ తునికి వేణు, మాజీ ఎంపీటీసీ బాబు, సువర్ణ భాస్కర్, డైరెక్టర్లు ఉప్పరి సాయిలు, మహిపాల్​రెడ్డి, అంబల్ల మల్లేశం, సాజిద్, డప్పు రవి తదితరులు పాల్గొన్నారు.