రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ కు తాళం.. బాధితుల ఆందోళన

రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ కు తాళం.. బాధితుల ఆందోళన

 వరంగల్ జిల్లా రాయపర్తిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచు తాళం పడింది. తమ గోల్డ్ తమకు ఇప్పించాలంటూ నినాదాలు చేస్తూ కస్టమర్లు బయట నిరసనకు దిగారు. నవంబర్ 19న రాయపర్తి ఎస్బీఐ శాఖలో బంగారం దొంగతనం జరిగింది. 

19 కేజీల గోల్డ్ చోరీ అయిన క్రమంలో 2 కిలోల 520 గ్రాముల బంగారం రికవరీ చేశారు. ఏడు ముఠా సభ్యులు పాల్గొనగా పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే బ్యాంక్ లో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు నెలల తరబడి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. కాగా అధికారులు తమ బంగారం అడిగితే బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బ్యాంక్ ముందు బైటాయించి ఉన్నతాధికారులు వచ్చే వరకు బ్యాంక్ సేవలు కొనసాగనివ్వమని ఆందోళన చేపట్టారు.