స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI తో ఇబ్బందులు... కారణం ఇదే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI తో ఇబ్బందులు... కారణం ఇదే..

గత రెండు రోజులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI చెల్లింపుల్లో కస్టమర్లు ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. తమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI పనిచేయడం లేదని కస్టమర్లు బ్యాంకులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యవసర ప్రకటన చేసింది.

ఎస్బీఐ బ్యాంక్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్లో ఉంది. దీని కారణంగా ఎస్బీఐ కస్టమర్ల యూపీఐ సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రకటించింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. త్వరలో యూపీఐ సేవలను పునరుద్దరిస్తామని  తెలిపింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. ఇంటర్నెట్ ద్వారా 117 మిలియన్లు, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వరసగా 64మిలియన్ల కస్టమర్లను కలిగి ఉంది. SBI పక్కా వ్యూహంలో డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది.  

2023 ఆర్థిక సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్, లైఫ్స్టైల్ ప్లాట్ ఫారమ్ YONO ద్వారా 63 శాతం కొత్త సేవింగ్స్ ఖాతాలను బ్యాంకు ప్రారంభించింది. 6.34 కోట్ల కంటే ఎక్కువ వినియోగదారులు కలిగి వున్న YONO 2024 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో కోటి కంటే ఎక్కువ రోజువారీ లాగిన్ లను చూసింది. 

YONO ద్వారా డిజిటల్ రుణాలు, బ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ద్వారా రూ. 5,428 కోట్ల రుణాలు ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.