బ్రాహ్మణ పరిషత్​కు100 కోట్లు కేటాయించాలి.. డిప్యూటీ సీఎం భట్టికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల వినతి

బ్రాహ్మణ పరిషత్​కు100 కోట్లు కేటాయించాలి.. డిప్యూటీ సీఎం భట్టికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల వినతి

హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణ పరిషత్ కు బడ్జెట్​లో రూ.100 కోట్లు కేటాయించాలని రాష్ట్ర సర్కార్‌‌‌‌ను రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కోరారు. ఆదివారం ప్రజా భవన్​లో భట్టి విక్రమార్కను ఎంపీ మల్లు రవితో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు వారణాసి రామ్ ప్రసాద్, ప్రమోద్, రాఘవేంద్ర శర్మ, మురళీధర్ రావు, శ్రీనివాసరావు కలిసి వినతిపత్రం అందించారు. 

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్  నిర్వహించే వివేకానంద ఓవర్సీస్  స్కీమ్, బెస్ట్ స్కీమ్, ఇతర కార్యక్రమాల్లో లబ్ధిదారులను ఆదుకునేందుకు రూ.100 కోట్లు అవసరమన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్  ఏర్పాటు చేయడంతో పాటుతమ కమ్యూనిటీకి అభివృద్ధి పథకాలను రూపొందించాలని కోరారు. అర్చకుల 
రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్, గౌరవ వేతనం పెంపు, ధూపదీప నైవేద్యం పథకం కింద అర్చకుల కోసం రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేపట్టాలని కోరారు. 

ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అందించి, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్  స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశం కల్పించాలని విన్నవించారు.