త్వరలో ఫ్యూచర్ ​సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ

త్వరలో ఫ్యూచర్ ​సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ
  • రేపటి కేబినెట్ ​సమావేశంలో ఆమోదించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌‌రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్​లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో బీసీలకు 42 శాతం రిజర్వేష న్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, రేషన్​ కార్డుల పంపిణీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, హెచ్ఎండీఏ మాదిరిగా ఫ్యూచర్​సిటీ డెవలప్​మెంట్ అథారిటీ ఏర్పాటు, భూ భారతి రూల్స్​పై చర్చించే అవకాశం ఉంది. 

రెండోసారి కులగణన సర్వేలో వచ్చిన వివరాలు, పూర్తి నివేదికపైనా కేబినెట్​లో చర్చించనున్నట్టు తెలిసింది. ఇటీవలె అసెంబ్లీని ప్రోరోగ్​చేస్తూ గవర్నర్​ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అసెంబ్లీ బడ్జెట్​సమావేశాల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు లిక్కర్​ రేట్ల పెంపు పైనా చర్చించ నున్నారు. ఎస్ఎల్బీసీ ఘటన, మహిళల కు అందిస్తున్న పథకాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు వంటి వాటిపై నా కేబినెట్​సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్‌‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్‌‌లో చర్చ జరపనున్నారు.