వర్షాకాలం లోపు సెంట్రల్ లైబ్రరీలో రిపేర్లు చేయండి: హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్

వర్షాకాలం లోపు సెంట్రల్ లైబ్రరీలో రిపేర్లు చేయండి: హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అఫ్జల్ గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రిపేర్లను వర్షాకాలంలోపు పూర్తి  చేయాలని  కలెక్టర్ అనుదీప్  అధికారులను ఆదేశించారు. మంగళవారం అఫ్జల్ గంజ్ లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ఆకస్మికంగా విజిట్​చేశారు. రూ 5.5 కోట్లతో చేపట్టిన రిపేర్లను పరిశీలించారు. కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన బుక్స్​ తెలుగులో ఉన్నాయా? ఇంకా ఏమైనా కావాలా అని చీఫ్ లైబ్రేరియన్ ను అడిగారు. వివిధ భాషలకు చెందిన 5 లక్షల 31 వేల పుస్తకాలున్నాయని ఆయన సమాధానమిచ్చారు.

యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేరయ్యే వారి కోసం బుక్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.  చదువుకోవడానికి వచ్చిన పలువురు అభ్యర్థులతో మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ కదిరవన్ పలని, లైబ్రరీస్ డిపార్ట్​మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీహరి శంకర్, హెచ్ఎండీఏ డీఈ అభిలాష్, గ్రంథాలయ చీఫ్ లైబ్రేరియన్​ టీజీవీ రాణి, సీనియర్ లైబ్రేరియన్ కేసరి హనుమంతు, లైబ్రరియన్ అపర్ణ పాల్గొన్నారు.