కరెంట్ అఫైర్స్ : బిట్ బ్యాంక్

కరెంట్ అఫైర్స్ : బిట్ బ్యాంక్
  • హైదరాబాద్​లోని ఆఫ్జల్​గంజ్​లో ఉన్న స్టేట్​ సెంట్రల్​ లైబ్రరీని గతంలో ఆసఫియా స్టేట్​ లైబ్రరీ అని పిలిచేవారు. ఈ లైబ్రరీని 1886లో స్థాపించారు. 
  • కొంత మంది దేశభక్తులు కలిసి హైదరాబాద్​ ఓల్డ్​ సిటీ లాల్​దర్వాజ ప్రాంతంలో 1895లో భారత గుణవర్థక సంస్థను స్థాపించారు. 
  • సుల్తాన్​బజార్​లో 1901 సెప్టెంబర్​ 1న శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. 
  • సికింద్రాబాద్​లోని ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయాన్ని 1905 సెప్టెంబర్​ 30న స్థాపించారు. 1908 జనవరి 29న హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. 
  • హనుమకొండలోని రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావు పనిచేశారు. 
  • 1915లో ఎర్రుపాలెంలో మహబూబియా గ్రంథాలయం స్థాపించారు. 
  • 1917లో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశన గ్రంథాలయాన్ని సూర్యాపేటలో స్థాపించారు. 
  • 1918లో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయాన్ని నల్లగొండలో స్థాపించారు. 
  • మడికొండ, సిరిసిల్ల, చెన్నూర్​లో గోదావరి వచనాలయాలు స్థాపించబడ్డాయి.
  • 1939లో అణా గ్రంథాలయాలను కె.సి.గుప్తా స్థాపించారు. 
  • వట్టికోట ఆళ్వారుస్వామి స్థాపించిన గ్రంథాలయం దేశోద్ధారక గ్రంథాలయం. 
  • కోదాటి నారాయణరావు కృషి మూలంగా ఖమ్మంలో విజ్ఞాన నికేతన గ్రంథాలయం స్థాపించారు. 
  • విజ్ఞాన చంద్రిక గ్రంథాలయ సంస్థ హైదరాబాద్​లోని రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు ఇంట్లో  ఉండేది. 
  • నిజాం పోలీసుల నిఘా కారణంగా విజ్ఞాన చంద్రిక గ్రంథాలయాల సంస్థ కార్యాలయాన్ని మద్రాస్​కు తరలించారు. 
  • అణాకు ఒక పుస్తకాన్ని అమ్మిన వారు కేసీ గుప్తా. ఈ  సంస్థ ప్రచురించిన తొలి పుస్తకం హైదరాబాద్​ రాజ్యాంగ సంస్కరణలు.
  • నిజాం తీసుకువచ్చిన సంస్కరణలను ఉర్దూ నుంచి తెలుగులోకి వెల్దుర్తి మాణిక్యరావు అనువదించారు. 
  • రైతు అనే పుస్తకాన్ని వెల్దుర్తి మాణిక్యరావు ముద్రించారు. ఈ పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది. 
  • నెమిలికొండలోని విజ్ఞాన ప్రచారిణి గ్రంథాలయం రచయితలతో గ్రామ వ్యవసాయం, వైద్యం, పరిశ్రమలు, చారిత్రక విషయాలపై నాలుగు గ్రంథాలను ప్రచురించింది. 
  • 1932లో ఏర్పడిన హైదరాబాద్​ సాహిత్య పరిషత్​కు అధ్యక్ష, కార్యదర్శులుగా ఆచార్య రాయప్రోలు సుబ్బారావు, ఆచార్య కురుగంటి సీతారామం వ్యవహరించారు. 
  • బూర్గుల రంగనాథరావు, నెల్లూరు కేశవస్వామి, వెల్దుర్తి మాణిక్యరావుల కృషితో 1939లో సాధన సమితి ఏర్పడింది.
  • వట్టికోట ఆళ్వారుస్వామి 1941లో స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల తరఫున 30 పుస్తకాలను ప్రచురించారు. 
  • గ్రంథాలయ నిర్వాహకులు పరస్పర సానుభూతి సహకారాలు తెల్పుకోవడం కోసం 1925లో ఖమ్మం జిల్లా మధిరలో గ్రంథాలయ మహాసభ నిర్వహించారు.
  • మధిరలో జరిగిన మొదటి గ్రంథాలయ మహాసభకు ప్రముఖ న్యాయవాది పింగళి వెంకటరామారెడ్డి అధ్యక్షత వహించారు. 
  • రెండో గ్రంథాలయ మహాసభ వామన్​ నాయక్​ అధ్యక్షతన 1929 మే 31, జూన్​ 1వ తేదీల్లో సూర్యాపేటలో జరిగింది. 
  • నిజామాంధ్రోద్యమం తెలంగాణవ్యాప్తంగా వ్యాపించడానికి గ్రంథాలయాలు ప్రధాన కారణమయ్యాయి.