ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలి : సి.సుదర్శన్ రెడ్డి

ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలి :  సి.సుదర్శన్ రెడ్డి

మహబూబాబాద్ ,వెలుగు: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి  సూచించారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లాలో ఇంటింటి సర్వేను పరిశీలించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి జాబితాను సవరించాలని, మరణించిన వారి పేర్లు తొలగించి, చిరునామా మార్పు, ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను విచారించి సరి చేయాలని పేర్కొన్నారు.1500 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు గుర్తించి రెండో కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.  ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు బీఎల్ వోలు  యాప్ లో సరిచేయాలని వివరించారు 

ఒకే కుటుంబ ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి వసతులు సరిగా ఉండేలా చూడాలన్నారు. ఓటర్లలో ఓటు హక్కుపై చైతన్యం కల్పించేందుకు విద్యాసంస్థలు, మీడియా, పబ్లిక్ ఏరియాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఏం) గోడౌన్ తనిఖీ చేసి, సీసీ కెమెరాలు పరిశీలించారు. అనంతరం టౌన్ లోని లెనిన్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, కంకర బోర్డు, రామచంద్రపురం, గుమ్ముడూరు , కాలనీల్లో జరుగుతున్న ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమాన్ని స్వయంగా

 పరిశీలించారు.