తప్పులు లేకుండా ఓటర్ల లిస్ట్​ రెడీ చేయాలి : ఎన్నికల  అధికారి సుదర్శన్​రెడ్డి

తప్పులు లేకుండా ఓటర్ల లిస్ట్​ రెడీ చేయాలి : ఎన్నికల  అధికారి సుదర్శన్​రెడ్డి
  • రాష్ర్ట  ప్రధాన  ఎన్నికల  అధికారి సుదర్శన్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు:  తప్పులు లేకుండా ఓటర్ల లిస్ట్​రెడీ చేయాలని రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్​రెడ్డి అన్నారు.  శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో  ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏటా ఎలక్షన్​ కమిషన్​ ప్రత్యేక ఓటరు నమోదు పోగ్రాం చేపడుతుందన్నారు.   ఓటరు జాబితాలో  మార్పులు, చేర్పులు,  సవరణలు, ఫొటోలు మార్పుల వంటివి సరిచేసుకోవచ్చాన్నారు.  బూత్​ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇండ్లను పరిశీలించాలన్నారు.   ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే పోలింగ్ బూత్​లో  ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.  

రాజకీయ పార్టీలు బూత్​ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పాలన్నారు.   గ్రాడ్యుయేట్, టీచర్​ఎమ్మెల్సీకి సంబంధించి అర్హులైన వారిని ఓటర్లుగా ఎంట్రీ చేసుకునేలా చూడాలన్నారు.  కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్,  అడిషనల్​ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్​రెడ్డి,  ఆర్డీవోలు రంగనాథ్​రావు, ప్రభాకర్, తహసీల్దార్​లు, ఎలక్షన్​వింగ్​ ఆఫీసర్లు, బూత్​ లెవల్​ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.బీఎల్​వోకు సన్మానంపాల్వంచ మండలం  వాడి పోలింగ్​బూత్​ స్థాయి అధికారి  నిమ్మల లీలను  రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్​రెడ్డి శాలువా కప్పి సన్మానించారు.  ఈమె సేవలు బాగున్నాయని భారత ఎన్నికల కమిషన్​ అభినందించిందన్నారు.