అసెంబ్లీ ముట్టడిలో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. పోలీసులు నేతలను ముందస్తు అరెస్ట్ చేయడం, ఆందోళన చేస్తున్న కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయడం, అమానుషంగా వ్యవహరించడం చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత పేదలకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వకపోవడం ..అదేవిధంగా అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలను బిజెపి చేపట్టిందన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంని సంతృప్తిపరచడానికి టిఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ఇవాళ ఆందోళన కార్యక్రమాలను చేపట్టిందన్నారు.