- మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పర్యటన నేపథ్యంలో జిల్లా ప్రజలు పోలీసుశాఖ వారికి సహకరించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ...మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, బీఆర్ఎస్పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
సెక్టార్ల వారీగా ఇంఛార్జి అధికారులను నియమించి పోలీసు లైజనింగ్ ఆఫీసర్గా జిల్లా ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వివరించారు. మెదక్ పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతిలేదని ఎస్పీ చెప్పారు.