మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ కేసులపై తెలంగాణ సీఐడీ ఫోకస్‌‌‌‌‌‌‌‌

  • యాంటీ హ్యూమన్‌‌‌‌‌‌‌‌ ట్రాఫికింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌తో ఆపరేషన్‌‌‌‌‌‌‌‌
  • 19,191 మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ కేసులను ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆఫీసర్లు
  • పదేండ్ల కింద కనిపించకుండా పోయిన బాలుడిని ఆధార్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా గుర్తించిన ఆఫీసర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ కేసులపై రాష్ట్ర సీఐడీ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. ఏండ్ల తరబడి కనిపించకుండా పోయిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేపట్టింది. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,780 మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు కాగా 19,191 కేసులను ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో 27 లాంగ్‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌ కేసులను ఛేదించారు. ఉమెన్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ వింగ్‌‌‌‌‌‌‌‌, యాంటీ హ్యూమన్‌‌‌‌‌‌‌‌ ట్రాఫికింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్స్‌‌‌‌‌‌‌‌, షీ సైబర్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సెర్చ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా గత పదేండ్లుగా ఆచూకీ తెలియకుండా పోయిన నలుగురిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలను సీఐడీ డీజీ శిఖాగోయల్‌‌‌‌‌‌‌‌ బుధవారం వెల్లడించారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌ కేసుల క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ జాతీయ స్థాయిలో 51.1 శాతం ఉండగా.. రాష్ట్ర ఉమెన్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ వింగ్‌‌‌‌‌‌‌‌ 84.25 శాతం కేసులను ట్రేస్ చేసిందని చెప్పారు. 

పదేండ్ల తర్వాత గుర్తింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కంచన్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఖలీల్‌‌‌‌‌‌‌‌ ఘోరి 2014 ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ 18న అదృశ్యం అయ్యాడు. అప్పటికి ఖలీల్‌‌‌‌‌‌‌‌ వయస్సు12 ఏండ్లు. ఇంటి నుంచి పారిపోయిన అతడు యూపీకి వెళ్లి కాన్పూర్‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో తిరుగుతుండగా అక్కడి పోలీసులు గుర్తించి చైల్డ్‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌ ఇన్ స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. ఖలీల్‌‌‌‌‌‌‌‌ 2022 వరకు ఆ ఇన్ స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాడు. తర్వాత రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి సనేహి సింగ్‌‌‌‌‌‌‌‌ ఖలీల్‌‌‌‌‌‌‌‌ను దత్తత తీసుకున్నాడు. ఖలీల్‌‌‌‌‌‌‌‌ తన పేరున అభినవ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌గా మార్చుకొని ఆధార్‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేయించాడు. 

లీల్‌‌‌‌‌‌‌‌ మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ కేసు సీఐడీ వద్ద పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో ఉమెన్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ వింగ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని షీ సైబర్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌, యాంటీ హ్యూమన్‌‌‌‌‌‌‌‌ ట్రాఫికింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్స్‌‌‌‌‌‌‌‌ సెర్చ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాయి. ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా యాంటీ హ్యూమన్‌‌‌‌‌‌‌‌ ట్రాఫికింగ్‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌ ముత్యాలు టీమ్‌‌‌‌‌‌‌‌ సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆధార్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఖలీల్‌‌‌‌‌‌‌‌ యూపీలో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఖలీల్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చారు.

నాచారంలో మిస్సింగ్‌‌‌‌‌‌‌‌.. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో జీవనం

రాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని నాచారం శాంతి సదన్‌‌‌‌‌‌‌‌ హోం నుంచి పదకొండేండ్ల బాలిక 2015 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌30న అదృశ్యమైంది. శాంతి సదన్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకుల ఫిర్యాదుతో నాచారం పీఎస్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదు చేసి సీఐడీకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. యాంటీ హ్యూమన్‌‌‌‌‌‌‌‌ ట్రాఫికింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సెర్చ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించింది. ఓ వ్యక్తిని వివాహం చేసుకుని నాలుగేండ్లుగా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నట్లు గుర్తించారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సమాచారాన్ని శాంతి సదన్‌‌‌‌‌‌‌‌ హోంకు అందించారు. అలాగే 2017 జూలై 5న చంద్రాయణగుట్ట నుంచి అదృశ్యమైన పదేండ్ల బాలిక, ఎనిమిదేండ్ల బాలుడిని బెంగళూర్‌‌‌‌‌‌‌‌లో ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేశారు. వీరిద్దరిని తల్లిదండ్రులకు 
అప్పగించారు.